Monday, October 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన : కేటీఆర్‌

రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన : కేటీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో రౌడీ షీటర్ల పాలన నడుస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో హోటల్‌ కార్మికుల యూనియన్‌ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు హోటల్‌ కార్మికులు బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ పాలనలో హోటల్‌ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదన్నారు. మంత్రి ఓఎస్డీ తుపాకీతో బెదిరించారనీ, తుపాకీ మంత్రి భర్తే ఇచ్చారని పోలీసులు అంటున్నారని తెలిపారు. తుపాకీతో రోహిన్‌రెడ్డి బెదిరించాడా? సుమత్‌ బెదిరించాడా? అని ప్రశ్నించారు. అలీబాబా దొంగల ముఠాతో వేగలేక మంచి ఐఏఎస్‌ రాజీనామా చేశారన్నారు. లిక్కర్‌ బాటిల్స్‌ స్టిక్కర్‌ కాంట్రాక్టు కోసం సీఎం అల్లుడు,మంత్రి కొడుకు పోటీ పడ్డారని విమర్శించారు. రెండేండ్ల పాలనలో తెలంగాణను కాంగ్రెస్‌ ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చడం దారుణమన్నారు. కారు కావాలా…? బుల్డోజర్‌ కావాలా…?అనే దాన్ని ప్రజలే తేల్చుకోవాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఓటింగ్‌ రోజు ప్రజలు ఓట్లకు రారనే ముద్ర ఉందనీ, ఈసారి ప్రతి ఒక్కరు వచ్చి ఓటేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

వడ్డెరలకు రాజకీయంగా న్యాయం చేస్తాం : కేటీఆర్‌
రాజకీయంగా వడ్డెరలకు తమ పార్టీ తరఫున న్యాయం చేస్తామనీ, ఈ విషయంపై కేసీఆర్‌తో మాట్లాడుతామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు భరోసానిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వడ్డెర సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. అందులో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాత మధు, తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ కాకమ్మ కథల్ని హైదరాబాద్‌ ప్రజలు నమ్మలేదనీ, నగరంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయలేదనీ, హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చుతున్నదని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికతో ప్రజల్ని మరోమారు మోసం చేసేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. కంటోన్మెంట్‌ ఎన్నికలో గెలిచి ఏం సాధించిందని ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పేరు చెప్పి ప్రజల్ని మోసం చేసిందన్నారు. కేసీఆర్‌ ఎప్పుడు కూడా కులం, మతం పేరుతో రాజకీయం చేయలేదని తెలిపారు. రానున్నది తమ ప్రభుత్వమేననీ, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికతోనే అది ప్రారంభమవుతుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -