- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో నిత్యం ఎక్కడో ఒకచోట హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ కాటేదాన్ పరిధిలో వట్టెపల్లి మలుపు వద్ద అర్ధరాత్రి రౌడీషీటర్ సోహెల్‌పై మరో రౌడీషీటర్, అతడి అనుచురులు కత్తులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సోహెల్‌కు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.
- Advertisement -



