– రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.
నవతెలంగాణ-మల్హర్ రావు/పలిమేల
మంథని నియోజకవర్గంలోని అతి మారుమూల ప్రాంతమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని పలిమెల మండలానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం నుండి పలిమెల నూతన మండల పరిషత్ కార్యాలయానికి రూ.1.50 లక్షలతో నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పలిమెల మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఉండడం వల్ల మారుమూల ప్రాంతమైన పలిమేల మండలంలో గ్రామాలైన పంకెన, పలిమెల, దమ్మురు, సర్వాయిపేట, లెంకల గడ్డ, మోదేడు, నీలంపల్లి,ముకునూరు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేవేసే విధంగా ఉపయోగపడుతుందన్నారు.