నవతెలంగాణ-హైదరాబాద్ : పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ ఔషధ పరిశ్రమ ప్రమాద స్థలిని మంత్రులతో కలిసి పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామన్నారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధితుల పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్‌లో జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరిశ్రమలకు స్పష్టమైన సూచనలు ఇస్తామన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సీఎం రేవంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES