-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ ప్రకటన
-దాచారంలో ఇందిరమ్మ ఇళ్లుకు గడప ప్రతిష్టాపన
నవతెలంగాణ – బెజ్జంకి
మండలంలోని అయా గ్రామాల్లోని లబ్ధిదారులు తమ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి గ్రామంలో మొదటగా గృహప్రవేశం చేసే లబ్దిదారుడికి రూ.10 వేల నగదుతో పాటు దంపతులకు నూతన వస్త్రాలందజేయనున్నట్టు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ ప్రకటించారు. గురువారం మండల పదిధిలోని దాచారం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారురాలు బామండ్ల బాలవ్వ ఇంటి గడప ప్రతిష్టాపన కార్యక్రమానికి మండల కాంగ్రెస్ నాయకులు హజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు తమ ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకుని ప్రభుత్వ సహాయాన్ని పొందాలని మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి కోరారు.ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,బీసీ సెల్ మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, నాయకులు బైర సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
మొదటి గృహ ప్రవేశదారుడికి రూ.10 వేల నజరాన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES