- Advertisement -
– ఎన్ ఆర్ ఐ బాలరాజు గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారంపేట గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ ఖర్చులకోసం సోమార్పేట గ్రామ ఎన్ఆర్ఐ అల్ట్రిష గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ దుబాయ్ ఇంచార్జ్ బాలరాజు గౌడ్ రూ.10,000 వేల టోర్నమెంట్ నిర్వహణకు అందజేశారు. ఈ డబ్బులను కాంగ్రెస్ పార్టీ మాచారెడ్డి మండల్ అధ్యక్షులు మాలోత్ నౌసిలాల్ నాయక్ చేతుల మీదగా అందజేశారు. ఆర్థిక సాయం చేసిన బాలరాజు గౌడ్ కు నౌసిలాల్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



