Wednesday, November 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవరద బాధితుల కుటుంబాలకు రూ. 12.99 కోట్ల సాయం

వరద బాధితుల కుటుంబాలకు రూ. 12.99 కోట్ల సాయం

- Advertisement -

ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వరద బాధిత కుటుంబాలను ఆదు కునేందుకు తక్షణ సాయం కింద రూ.12.99 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మంగళవారం ఉత్త ర్వులు విడుదల చేశారు. మొంథా తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న ఇండ్లకు రూ.15 వేల చొప్పున సాయం అందించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు పంపించిన నివేదికల ప్రకారం 15 జిల్లాల్లో 8,662 ఇండ్లు దెబ్బతిన్నాయని వివరించారు. వారికి తక్షణ సాయంగా రూ.12.99 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. గతనెల 27 నుంచి 30 వరకు వరుసగా నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని వివరించారు. వరంగల్‌, హన్మకొండ, వికారాబాద్‌, వనపర్తి, రంగారెడ్డి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, మహబూబాబాద్‌, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -