Tuesday, October 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు

రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు

- Advertisement -

టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో రికార్డు ధర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) సోమవారం నిర్వహించిన వేలంలో భూ మికి రికార్డు ధర పలికింది. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో ఎకరం ధర రూ.177 కోట్లు చెల్లించారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ వేలం వేసింది. దీంట్లో పాల్గొన్న ఎంఎస్‌ఎన్‌ రియాలిటీ సంస్థ అత్యధిక ధరతో 7.6 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. ఎకరాకు రూ.177 కోట్ల చొప్పు న మొత్తం రూ.1357 కోట్లకు చేజిక్కించుకుంది. తెలంగాణ హౌసింగ్‌ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో కూడా రికార్డు ధర నమోదైంది. కుత్బుల్లాపూర్‌ పరిధిలోని చింతల్‌లో రికార్డు స్థాయిలో చదరపు గజం రూ.1.14 లక్షలు పలికింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -