Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసేవాలాల్‌ జయంతికి రూ.2 కోట్లు మంజూరు

సేవాలాల్‌ జయంతికి రూ.2 కోట్లు మంజూరు

- Advertisement -

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాలను ఈ నెల 15న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లంబాడీ గిరిజన సాంప్రదాయ పద్ధతి ప్రకారం సంత్‌ సేవాలాల్‌ ఆరాధన కార్యక్రమాలు, గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ తెలిపారు. ఈ నెల 15 నుంచి 21 వరకు అన్ని జిల్లాల్లోని శాసనసభా నియోజకవర్గాల్లో జరుగనున్న ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. రెండు కోట్లు మంజూరు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -