- Advertisement -
– కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ : అమెరికా అధిక టారిఫ్‌ల నేపథ్యంలో ఎగుమతిదారులకు భారీ ప్రోత్సాహకాలను ఇవ్వాలని మోడీ సర్కార్ కసరత్తు చేస్తోంది. వచ్చే ఐదేండ్లకు గాను రూ.20,000 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. అమెరికా విధించిన 25 శాతం సుంకాలను ఎదుర్కోవడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఇటీవల వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖను ఎగుమతిదారులు కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదారేండ్లకు గాను రూ.20,000 కోట్లకు పైగా నిధులు అవసరమని అంచనా వేశామని ఓ అధికారి పేర్కొన్నారు. దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. ఆగస్టు నాటికి దీనిని ఖరారు చేసి, సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
- Advertisement -