Wednesday, November 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ.202.93 కోట్లు విడుదల

ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ.202.93 కోట్లు విడుదల

- Advertisement -


హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వి.పి.గౌతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు బిల్లుల రూపేణా ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేశారు. ఇండ్ల నిర్మాణపు పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియలో భాగంగా నవంబరు 11న పురోగతి సాధించిన మేరకు 18,247 మంది లబ్దిదారులకు బిల్లులను విడుదల చేసినట్టు హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ వి.పి.గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారం లబ్దిదారులకు చేసిన చెల్లింపుల్లో బేస్‌ మెంట్‌ లెవల్‌ నిర్మాణాలు 4,615, రూఫ్‌ లెవల్‌ (గోడలు పూర్తి) అయినవి 8,517, శ్లాబ్‌ వేసినవి 5,115 ఇండ్లు ఉన్నాయని వివరించారు.

మొత్తం రూ.2900 కోట్ల చెల్లింపు
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇప్పటి వరకు మొత్తం రూ.2,900.35 కోట్లను చెల్లించారు. వీటిలో బేస్‌ మెంట్‌ లెవల్‌ (బీఎల్‌) దాటిన ఇండ్లకు రూ.1,610.79 కోట్లు, రూఫ్‌ లెవల్‌ (ఆర్‌ఎల్‌) రూ.716.91 కోట్లు, రూఫ్‌ క్యాస్టెడ్‌ (శ్లాబ్‌ పూర్తి-ఆర్‌సీ) అయిన ఇండ్లకు రూ.572.65 కోట్లను లబ్ధిదా రుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంతవరకు 2,33,069 ఇండ్ల పనులు ప్రారంభం కాగా, వాటిలో బేస్‌మెంట్‌ (బీఎల్‌) స్థాయిలో 90,613, గోడల నిర్మాణం పూర్తి అయిన స్థాయిలో (ఆర్‌ఎల్‌) 41,212 ఇండ్లు, శ్లాబ్‌ పూర్తి (ఆర్‌సీ) అయినవి 37,400 ఇండ్లు ఉన్నాయని గౌతం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -