Thursday, July 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కత్తులతో బెదిరించి రూ.3.50 లక్షలు చోరీ 

కత్తులతో బెదిరించి రూ.3.50 లక్షలు చోరీ 

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
 సినీ పక్కిలో కత్తులతో బెదిరించి రూ.3.50లక్షల నగదు చోరీ చేసి ఎత్తుకెళ్లిన సంఘటన మండలంలోని కోనాపూర్ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కోనాపూర్ గ్రామం సమీపంలో దోపిడి సంఘటన జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగినిపల్లి గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మి నారాయణ, తన మిత్రుడి జలంధర్ తో కలిసి హార్వెస్టర్ కొనుగోలు కోసంక 3.50 లక్షల నగదుతో భీంగల్ వెళ్తున్నాడు. ఈ సమయంలో కోనాపూర్ గ్రామ సమీపంలో నంబర్ ప్లేట్ లేని స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డగించారు. కత్తులతో బెదిరించి బాధితుల వద్ద నుండి రూ.3.50 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్ లను  దోచుకుని స్కూటీపై అక్కడి నుంచి పరారయ్యారని ఎస్ఐ తెలిపారు. బాధితుడు కొమ్ము లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -