– మొత్తం 12 ప్రభుత్వ బ్యాంకుల్లో పెద్దలకు మెహర్బానీ
న్యూఢిల్లీ : గడిచిన నాలుగేండ్లలో ప్రభుత్వ రంగ బ్యాంక్ (పీఎస్‌బీ)ల్లో రూ.4.48 లక్షల కోట్ల మొండి బాకీలు రద్దు అయ్యాయి. అప్పులు తీసుకున్న సంస్థలు, వ్యక్తులు వడ్డీ లేదా మూలధనం చెల్లింపులను నిలిపివేస్తే.. వాటిని పారు బకాయిలు (ఎన్‌పీఏ)లుగా పరిగణిస్తారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల రాజ్యసభకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థిక సంవత్సరం 2021-22 నుంచి 2024-25 మధ్య అత్యధికంగా రూ.80,197 కోట్ల ఎన్‌పీఏలను రద్దు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 68,557 కోట్లతో రెండవ స్థానంలో ఉండగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 65,366 కోట్లతో మూడవ స్థానంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 55,279 కోట్లతో, కెనరా బ్యాంక్ రూ. 47,359 కోట్లతో, ఇండియన్ బ్యాంక్ రూ. 29,949 కోట్ల రద్దుతో వరుస స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 12 ప్రభుత్వ బ్యాంకులు రూ. 4.48 లక్షల కోట్ల మొండి బాకీలను రద్దు చేశాయి. అయితే 2021 మార్చినాటికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో 9.11 శాతంగా ఉన్న మొండి బాకీలు.. 2025 మార్చి నాటికి 2.58 శాతానికి తగ్గాయి.
నాలుగేండ్లలో రూ.4..48 లక్షల కోట్ల మొండి బాకీలు రద్దు
- Advertisement -
- Advertisement -