రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని పట్టణ అభివృద్ధికి రూ.45 కోట్ల నిధులు మంజూరైయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నిధులు మంజూరుకు కృషి చేసిన మంత్రికి స్థానికి నాయకులు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వివిధ అభివృద్ధి పనులకు మంజూరు అయిన వారికి మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నారు. అందులో కూచిరాజుపల్లి స్కూల్ వద్ద రూ.4 కోట్ల 50 లక్షలతో నిర్మించబోతున్న ఆర్ అండ్ బీ అతిథి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఆర్ &బీ రోడ్డు కూచిరాజుపల్లి స్కూల్ వద్ద రూ.60 లక్షలతో నిర్మించబోతున్న మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేయనున్నారు. ఆర్ &బీ రోడ్డు కూచిరాజుపల్లి స్కూల్ వద్ద రూ.10 లక్షలతో నిర్మించబోతున్న కూచిరాజుపల్లి బస్టాండ్ శంకుస్థాపన, రూ.10 లక్షలతో నిర్మించబోతున్న శ్రీరామ్ నగర్ బస్టాండ్ శంకుస్థాపన (భూమి పూజ) చేయనున్నారు.ఆర్ అండ్ బి రోడ్డు కూచిరాజుపల్లి వద్ద రూ.30 లక్షలతో నిర్మించబోతున్న ఈద్గా నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. బోయినపేట నుండి గంగపురి మీదికి రూ.9 కోట్ల 30 లక్షలతో (6.00+3.30) నిర్మించబోతున్న బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఆర్ &బి పెద్దపల్లి రోడ్డు వద్ద నూతన కమ్యూనిటీ హాల్ వద్ద రూ.20 లక్షలతో నిర్మించబోతున్న గంగాపురిలోని గౌతమి మేషన్ సంఘం (తాపి మేస్త్రి సంఘం) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.ఓడేడు రోడ్డు గంగాపురి వద్ద రూ.10 లక్షలతో నిర్మించబోతున్న బస్ స్టాండ్ కు భూమి పూజ చేయనున్నారు. ఓడేడు రోడ్డు గంగాపురిలో రూ.20 లక్షలతో నిర్మించబోతున్న ఎస్సి కమ్యూనిటీ హాల్,ఎంపిపిఎస్ స్కూల్ కంపాండ్ వాల్ శంకుస్థాపన.రూ.45 కోట్ల 15 లక్షలతో నిర్మించబోయే (ఏటిసి) అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కు ల్యాoడ్ విజిటింగ్ చేయనున్నారు.రూ.30 లక్షలతో నల్లపోచమ్మ ఆలయ సుందరీకరణ నిర్మాణ పనులు ప్రారబించనున్నారు.ఇందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



