- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ‘మొంథా’ తుపాను ప్రభావంతో తెలంగాణలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలని ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాజా వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇళ్లు మునిగిన వారికి రూ.15వేలు, ఆవులు, గేదెలు మృత్యువాత పడితే రూ.50వేలు, మేకలు, గొర్రెలకు రూ.5వేలు, పంట నష్టం కింద ఎకరాకు రూ.10వేలు చెల్లించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
- Advertisement -

 
                                    