Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమత్స్యకారుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలి

మత్స్యకారుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలి

- Advertisement -

ఎక్స్‌గ్రేషియా బకాయిలు బడ్జెట్‌లో ప్రకటించాలి
తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో మత్స్యకారుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించి, ఖర్చు చేయాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. దానితోపాటు వెయ్యి మంది మత్స్యకారులకు రావాల్సిన ఎక్స్‌ గ్రేషియో బకాయిల నిధుల్ని కూడా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న దశల వారి ఆందోళనల్లో భాగంగా ఫిబ్రవరి 23న అన్ని జిల్లాలో కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపారు. అలాగే మార్చి 2వ తేదీ కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేపడతామని వివరించారు. ఈ సందర్భంగా తమ సంఘం రాష్ట్ర కమిటీ చేసిన పలు తీర్మానాలను ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -