- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పతంగులు ఎగురవేయడంలో మాంజా వినియోగంపై పోలీసులు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా కొన్ని చోట్ల ఈ మాంజాను వినియోగిస్తున్నారు. దీనిని రహస్యంగా అమ్ముతున్నవారి సమాచారం తనకు ఇవ్వాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రజలను కోరారు. వారి వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా రూ.5వేల ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి కేసులు పెట్టేలా చూస్తామని హెచ్చరించారు.
- Advertisement -



