Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సేవా కార్యక్రమాల కోసం రూ. 5వేలు అందజేత 

సేవా కార్యక్రమాల కోసం రూ. 5వేలు అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
తన జన్మదినాన్ని పురస్కరించుకొని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల కోసం రూ.5వేలు అందజేశారు. ఈ మేరకు  ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న చైర్మన్ పాలెపు నర్సయ్య లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలకు తన వంతుగా రూ.5వేలు సహాయంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే సహాయంగా ప్రకటించిన రూ.5వేల నగదు మొత్తాన్ని లయన్స్ క్లబ్ కోశాధికారి తెడ్డు రమేష్ కు సభ్యుల సమక్షంలో అందజేశారు. నూతనంగా ఏర్పాటుచేసిన మండల లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల కోసం మొట్టమొదటగా ఆర్థిక సహాయాన్ని అందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్యకు క్లబ్ కార్యవర్గ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాలెపు నర్సయ్యకు లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులంతా  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షులు లుక్క గంగాధర్, ప్రధాన కార్యదర్శి నడిమేల రేవతి గంగాధర్, క్లబ్ మెంబర్షిప్ చైర్పర్సన్ హైమద్, డైరెక్టర్ కనక గంగాధర్, సభ్యులు సుంకరి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -