Saturday, February 14, 2026
E-PAPER
Homeజాతీయంప్రతి మహిళ ఖాతాలో రూ.5వేలు!

ప్రతి మహిళ ఖాతాలో రూ.5వేలు!

- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌
సీపీఐ(ఎం) అభినందన


చెన్నై : మహిళలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ మంచి కబురు అందించారు. కలైంగర్‌ మగలిర్‌ ఉరిమై తిట్టమ్‌ (కేఎంయూటీ) పథకం కింద 1.31కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.5వేలు చొప్పున జమ చేశారు. ప్రతి నెలా వేసే వెయ్యి రూపాయలను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలలకు కలిసి ఒకేసారి ముందుగా రూ.3వేలు, సమ్మర్‌ ప్రత్యేక సాయం కింద రూ.2వేలు కలిపి మొత్తంగా రూ.5వేలు వేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ‘ద్రవిడియన్‌ 2.0’ కింద నెలవారీ ఇచ్చే మొత్తాన్ని రూ.2వేలకు పెంచుతామని స్టాలిన్‌ ప్రకటించారు.

ఈ క్రమంలో ఎవరు ఎలాంటి అడ్డంకులు పెట్టినా వాటితో నిమిత్తం లేకుండా వెనుకడుగు వేయకుండా రాష్ట్ర మహిళలకు బాసటగా వుంటానని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈసందర్భంగా హామీ ఇచ్చారు. మహిళల మద్దతుతో తాము ఎన్నికల్లో గెలుపొందుతామని స్టాలిన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళలకు ఇచ్చే సాయాన్ని మూడు నెలల పాటు ఆపేసేందుకు ఢిల్లీలోని ఒక గ్రూపు, ఆ గ్రూపునకు బానిసలుగా వున్న తమిళనాడులోని మరో గ్రూపు కుట్ర పన్నుతున్నారంటూ సమాచారం వుందని దాన్ని తమ ప్రభుత్వం విజయవంతంగా అధిగమించిందని స్టాలిన్‌ చెప్పారు. కొంతమంది కోర్టుకు వెళ్లాలనుకుంటున్నట్లు కూడా తెలుస్తోందన్నారు. అందుకే ఇవన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

సీపీఐ(ఎం) అభినందన
తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం స్వాగతించారు. ఈ చర్యతో లబ్దిదారులకు కలిగిన ఆనందాన్ని తాను గ్రహించగలనంటూ షణ్ముగం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -