- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సర్కార్ ప్రకటించిన ఎకరాకు రూ.10వేల పరిహారం ఏ మూలకూ సరిపోదని వ్యాఖ్యానించారు. మొలకెత్తినా, బూజు పట్టినా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా ధాన్యం కొనాలన్నారు.
- Advertisement -

 
                                    