ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే అధికం
పేరుకుపోతున్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు
న్యూఢిల్లీ : బ్యాంక్‌ల్లో కాల వ్యవధి ముగిసిపోయినప్పటికీ ఖాతాదారులు వెనక్కి తీసుకోని (అన్‌క్లెయిమ్డ్) డిపాజిట్లు భారీగా పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది జూన్ చివరికి రూ.67,003 కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.58,330 కోట్లు ఉండగా.. ప్రయివేటు బ్యాంక్‌ల్లో రూ.8,673.72 కోట్లు చొప్పున నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు తెలిపారు. పిఎస్‌బిల్లో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లోనే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.19,330 కోట్లుగా ఉన్నాయి. తర్వాత పిఎన్‌బిలో రూ.6,910 కోట్లు, కెనరా బ్యాంక్‌లో రూ.6,278 కోట్లు చొప్పున ఉన్నాయి. ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంకుల్లో రూ.2,063 కోట్లు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లున్నాయన్నారు.
బ్యాంకుల్లో మురుగుతున్న రూ.67వేల కోట్లు
- Advertisement -
- Advertisement -