Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంలింక్‌ రోడ్ల నిర్మాణానికి రూ. 700కోట్లు

లింక్‌ రోడ్ల నిర్మాణానికి రూ. 700కోట్లు

- Advertisement -

– గిరిజన ప్రాంతాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
– జీవో 240ప్రకారం నిధుల మంజూరు : విలేకర్ల సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

గిరిజన ప్రాంతాల్లోని 429 గిరిజన ఆవాసాలను కలిపే లింక్‌ రోడ్ల నిర్మాణం కోసం రూ.700కోట్ల నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసిందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. గిరిజన తండాలకు సంబంధించిన రోడ్ల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఉందని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పలు జిల్లాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జీవో 240 ప్రకారం నిధులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. ఐటీడీఏల పరిధిలోని 236 ఆమ్లెట్‌ గ్రామాల రోడ్ల నిర్మాణానికి ఎస్టీ సబ్‌ప్లాన్‌ ద్వారా నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. వీటన్నింటికీ త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజన తండాలను గాలికి వదిలేసిందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా అంగీకరించారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
2014కు ముందు కేసీఆర్‌ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని? 2023 తర్వాత పెరిగిన ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో అందరికీ తెలుసని వివరించారు. కాళేశ్వరంతోపాటు మిషన్‌ భగీరథ, మిషన్‌కాకతీయలో కూడా భారీ అవినీతికి పాల్ప డ్డారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కక్ష సాధింపులకు పాల్పడబోదని చెప్పారు. హరీశ్‌రావు, సంతోశ్‌రావుల వెనుక కాంగ్రెస్‌ ఉందనే ఆరోపణల్లో నిజం లేదని కొట్టి పారేశారు. వారి కుటుంబ తగాదాలను పరిష్కరించుకోలేక మరొకరిపై నిందవేయటం తగదని హితవు పలికారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad