– మంజూరు చేసిన ఆర్‌ఈసీ
న్యూఢిల్లీ : కర్నూలులోని 1.04 గిగావాట్ (జీడబ్ల్యూ) హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్టుకు ప్రభుత్వ రంగ మహారత్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి) ఆర్‌ఈసీ భారీ ఆర్థిక మద్దతును అందించింది. ఈ ప్రాజెక్టుకు రూ.7,500 కోట్లను మంజూరు చేసినట్లు ఆర్‌ఈసీ వెల్లడించింది. ఓ ప్రయివేటు ప్రాజెక్టుకు ఆర్‌ఇసి మంజూరు చేసిన అతిపెద్ద ఫైనాన్సీంగ్ ఇదే కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి అంచనా రూ. 9,910 కోట్లుగా ఉంది. కాగా గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టర్ బ్రూక్‌ఫీల్డ్ మరో సంస్థ యాక్సిస్ ఎనర్జీ సంయుక్త భాగస్వామ్యం మద్దతుతో క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫామ్ ఎవ్రెన్ ద్వారా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. బ్రూక్‌ఫీల్డ్‌కు ఎవ్రెన్‌లో 51.49 వాటా ఉంది. యాక్సిస్ ఎనర్జీతో జాయింట్ వెంచర్‌గా బ్రూక్‌ఫీల్డ్ భారత్‌లో ‘ఎవ్రెన్’ క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇది దేశ వ్యాప్తంగా 11 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేస్తొంది.
కర్నూల్‌లోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌కు రూ.7,500 కోట్లు
- Advertisement -
- Advertisement -

                                    

