Sunday, November 2, 2025
E-PAPER
Homeజాతీయంపౌరసత్వం కోసం రూ.800

పౌరసత్వం కోసం రూ.800

- Advertisement -

కౌంటర్లు తెరిచిన బెంగాల్‌ బీజేపీ నేతలు
కోల్‌కతా :
అది పశ్చిమ బెంగాల్‌లో ఉత్తర 24 పరగణాల జిల్లా ఠాకూర్‌నగర్‌లో ఉన్న మతువా మహాసంఘ కార్యాలయం. అక్కడ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పేరిట బీజేపీ ఓ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. సీఏఏ ఫారం కావాలంటే ఇరవై రూపాయలు, దానిని పూర్తి చేసి అప్‌లోడ్‌ చేయాలంటే మరో రూ.800 చెల్లించాలి. అలా చేస్తే ఫారం తిరస్కరణకు గురయ్యే అవకాశమే ఉండదని గ్యారంటీ ఇస్తారు. భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ కార్యాలయం గత రెండు నెలలుగా జనం రాకపోకలతో కళకళలా డుతోంది. కేంద్ర మంత్రి శంతను ఠాకూర్‌, ఆయన సోదరుడు సుబ్రత సహా పలువురు బీజేపీ నేతలు ఆ శిబిరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ‘మతువా గుర్తింపు కార్డు’, ‘హిందూ గుర్తింపు కార్డు’ల పంపిణీ జరుగుతుందని ప్రచారం చేశారు. హరిన్‌ఘటాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అశిం సర్కార్‌ నదియాలో ఇలాంటి శిబిరాన్నే స్వతంత్రంగా నిర్వహిస్తున్నారు. బెంగాల్‌లలో మతువా సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని వందలాది శిబిరాలను ఏర్పాటు చేశారు. దళిత హిందువులైన మతువాలు దశాబ్దాల క్రితమే బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చారు. వీరు ఇప్పటికీ పౌరసత్వం, గుర్తింపు తదితర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సీఏఏ లబ్దిదారులను సమీకరించడానికి బీజేపీ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 700కు పైగా సీఏఏ సహాయ శిబిరాలను ఏర్పాటు చేస్తామని గత నెల ప్రారంభంలోనే బీజేపీ ప్రకటించింది. మతువాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేశారు. సీఏఏ కింద పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రతి రోజూ సగటును ఐదు వందల మంది తమ శిబిరాలకు వస్తున్నారని రాష్ట్ర బీజేపీ ప్రతినిధి దేవ్‌జిత్‌ సర్కార్‌ చెప్పారు. సీఏఏ ఫారం, 6బీ ఫారం అప్‌లోడ్‌ చేయడానికి ఈ శిబిరాలలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను నియమించారు. అందుకోసం వారికి శిక్షణ కూడా ఇచ్చారు. అయితే మతువాలు దీనిపై పెద్దగా సంతోషిం చడం లేదు. ఇదంతా రాజకీయమని, జేబులు నింపుకో వడానికి ఇదో దారిగా మారిందని వారు వ్యాఖ్యానించారు. దరఖాసు ్తదారుల నుంచి డబ్బు తీసుకుంటున్న మాట నిజమేనని బీజేపీ నేతలు అంగీకరించారు. శిబిరాల లో పనిచేసే వారికి వేతనాలు ఇవ్వాలి కదా అన్నది వారి వాదన. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌ ప్రక్రియను సీఏఏతో ముడి పెట్టాలని బీజేపీ ప్రయత్ని స్తోందన్న విమర్శలు వస్తున్నాయి. బెంగాల్‌లో మరో ఆరు నెలల కాలంలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల మద్దతును పెంచుకోవడానికి బీజేపీ అన్ని ప్రయ త్నాలు చేస్తోంది. సీఏఏపై ఇచ్చిన హామీతోనే మతువాలు 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీకి మద్దతు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -