Saturday, March 14, 2026
E-PAPER
Homeబీజినెస్తెలంగాణలో రూ.84.15 కోట్ల జీఎస్టీ కుంభకోణం

తెలంగాణలో రూ.84.15 కోట్ల జీఎస్టీ కుంభకోణం

- Advertisement -

– నిందితుడి అరెస్ట్‌
నవతెలంగాణ – హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కుంభకోణాన్ని బయటపెట్టింది. ఎస్‌కేజీ ట్రేడింగ్‌ కంపెనీతో పాటు హెచ్‌ఎఫ్‌సీ స్టీల్‌ ట్యూబ్స్‌, విజరు ఇండిస్టియల్‌ నీడ్స్‌ ఎల్‌ఎల్‌పీ వంటి సంస్థల ద్వారా ఎలాంటి వస్తు సరఫరా లేకుండానే నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించి, సుమారు రూ.84.15 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టు అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో డేటా అనాలిసిస్‌ చేసిన అధికారులు, ఈ అక్రమాలకు ప్రధాన సూత్రధారి అయిన ఎస్‌కేజీ ట్రేడింగ్‌ కంపెనీ ప్రొప్రెయిటర్‌ సందీప్‌ కుమార్‌ గోయల్‌ను అరెస్ట్‌ చేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. పన్నుల వ్యవస్థలో పారదర్శకతను దెబ్బతీసే ఇలాంటి ఫేక్‌ ఇన్వాయిస్‌, ఐటీసీ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వాణిజ్య పన్నుల శాఖ ఈ సందర్భంగా హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -