ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి
నవతెలంగాణ – చేగుంట
తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారునికి రూ.9 వేల కోట్లతో సన్న బియ్యం అందించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా నృత్యాలు, పోతారాజుల ఆటలు, యాంకర్లచే పాటలు, భక్తులను అలరించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ రోడ్ గాంధీ చౌవరస్తా ఏర్పాటుచేసిన వేదిక మీద మంత్రి వివేక్ మాట్లాడుతూ కాలేశ్వరం నుండి 1200 టీఎంసీల నీళ్లు రావాలి, కేవలం 400 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయని, కాలేశ్వరం పిల్లర్లు కుంగాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసిందని, దుబ్బాక నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామని, అలాగే కరెంటు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు హామీ ఇచ్చామని, రాష్ట్రంలో రైతులకు 23 వేల కోట్లతో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్కు దక్కిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర లోని ప్రతి ప్రాంతంలో వైద్యం విద్య అందరికీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల నీళ్లు మన ప్రాంతానికి రావాల్సినప్పటికీ రాలేవన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు.
దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చేగుంట పట్టణ దివంగత కేంద్రంలో మాజీ మంత్రివర్యులు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఏ అభివృద్ధి లేదని, అలాగే నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేశారని అన్నారు. పలారం బండి ఊరేగింపులో భాగంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని, సండ్రు బ్రదర్స్ కుటుంబానికి, మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలు, కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ ఇంచార్జి రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, రాంపూర్ మాజీ సర్పంచ్ భాస్కర్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
రూ.9 వేలకోట్లతో పేదలకు సన్న బియ్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES