మంత్రులకు ఎస్‌డబ్ల్యూయూ విజ్ఞప్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2026-2027 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్టీసీకి రూ. 9500 కోట్లు కెటాయించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్‌టీయూససీ) ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి తెలిపారు. బడ్జెట్‌లో మహాలక్ష్మి పథకానికి నెలకు రూ. 380 కోట్లు చొప్పున సుమారు రూ 4560 ఇవ్వాలని కోరారు. విద్యార్థులు, దీవ్యాంగులు, జర్నలిస్టులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అమరవీరుల కుటుంబాలకు, కిడ్ని వ్యాదిగ్రస్తులకు, ఎన్జీవోలకు ఇస్తున్న సబ్సిడీ డబ్బులు సుమారు రూ 405 కోట్లు ,రిటైరైన ఆర్టీసీ కార్మికులకు వివిధ బకాయిలను చెల్లించడానికి సుమారు రూ. 1700 కోట్లు అవసరమన్నారు. కార్మికుల ఫిఎఫ్ అసలుకు వడ్డితో కలిపి సుమారు రూ 1560 కోట్లు, సీసీఏ వడ్డీతో కలిపి రూ 870 కోట్లు చెల్లించాలని సూచించారు. ఆర్టీసికి మొత్తం రూ 9500 కోట్లు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సమర్పించారు.
బడ్జెట్లో ఆర్టీసీకి రూ. 9500 కోట్లు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



