Friday, October 17, 2025
E-PAPER
Homeజాతీయంపాఠశాలలు, కాలేజీల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలపై నిషేధం

పాఠశాలలు, కాలేజీల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలపై నిషేధం

- Advertisement -

త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్న కర్నాటక
బెంగళూరు : ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి మతతత్వ సంస్థలు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ నియంత్రణలోని ఇతర సంస్థల్లోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కర్నాటక మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర న్యాయ, శాసనససభా వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్‌ గురువారం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సాగించే కార్యకలాపాలపై నిషేధిం విధించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరుతూ ఐటీ-బీటీ మంత్రి ప్రియాంక ఖర్గే లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ ఆస్తులైన కాలేజీలు, పాఠశాలలు, సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలా పాలను ఎంత మాత్రమూ అనుమతించరాదని ఖర్గే ఈ నెల 12న ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దేశంలోని పిల్లలు, యువత, ప్రజలు మొత్తంగా సమాజం సంక్షేమం దృష్టిలో వుంచుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వ ఆస్తుల ఆవరణల్లో నిర్వహించే అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో అక్కడి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌పై తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేయాల్సిందిగా చీఫ్‌ సెక్రటరీని సిద్ధరామయ్య ఆదేశించారు.

అధికారులకు షోకాజ్‌ నోటీసులు
ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలకు హాజరయ్యే ప్రభుత్వ అధికారులను సస్పెండ్‌ చేస్తామని మంత్రి ప్రియాంక ఖర్గే హెచ్చరించారు. తన విభాగంలో కొంతమంది ఉద్యోగులు ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ శత జయంతి ఉత్సవాలకు సంస్థ యూని ఫారంలో వెళ్ళారని, త్వరలో వారిని సస్పెండ్‌ చేస్తామని విలేకర్లకు తెలిపారు. ఇందుకు సంబంధించి పలువురు ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఇంకా ఇటువంటి సంస్థల కార్యకలపాలకు ప్రభుత్వ ఉద్యోగులు హాజరవుతున్నారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -