Saturday, October 4, 2025
E-PAPER
Homeజిల్లాలుఆర్‌టీఏ చలాన్‌, ఏపీకే లింక్‌లతో బేజారు

ఆర్‌టీఏ చలాన్‌, ఏపీకే లింక్‌లతో బేజారు

- Advertisement -

ఏపీకే లింక్ ఓపెన్ చేస్తే అంతే

అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి: విఠల్ రెడ్డి

నవతెలంగాణ నసురుల్లాబాద్

మీ వాహనంపై పెండింగ్‌ చలాన్లు ఉన్నాయని.. వెంటనే చెల్లించాలంటూ ఆర్‌టీఏ చలాన్‌ పేరుతో ఏపీకే లింక్‌లు వాట్సాప్ గ్రూపులకు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్ బీర్కూర్ మండలాల్లో అధికంగా ఆర్‌టీఏ చలాన్‌ పేరుతో ఏపీకే లింక్‌లు వాట్సప్ నంబర్లకు రావడంతో వ్యక్తిగత ఫోన్లు హ్యాంక్ కావడంతో ఓ అధికారిణి పోలీసులకు సమాచారం అందించారు.

బాన్సువాడ డివిజన్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి పోన్ నంబర్ తో కొందరికి ఆర్‌టీఏ చలాన్‌ పేరుతో ఏపీకే లింక్‌లు వాట్సాప్ గ్రూపులకు రావడంతో గమనించిన కింది స్థాయి ఉద్యోగులు అధికారిణి కి సమాచారం ఇవ్వడంతో అప్రమతం అయ్యారు. ఇలాగే చాలా మందికి ఇలాంటి మెసేజ్ లు రావడంతో ప్రజలు ఆందోళన గురవుతున్నారు. మండలంలో ఒక వ్యక్తికి వాట్సాప్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు సందేశం పంపారని తెలిపారు.

మీ వాహనంపై పెండింగ్‌ చలాన్లు ఉన్నాయని, వెంటనే చెల్లించేందుకు దిగువ ఇచ్చిన ఆర్‌టీఓ చలాన్‌ ఏపీకే లింక్‌ను క్లిక్‌ చేయాలని సూచించారని. ఇది నిజమని నమ్మిన బాధితుడు లింక్‌ తెరవగా. ఫోన్‌ను హ్యాక్‌ కావడంతో జరుగుతుందని, వెంటనే పోన్ స్విచ్ ఆఫ్ చేయడం, పోలీసులకు సమాచారం ఇవ్వడమే మంచిదని సూచిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండండి: బాన్సువాడ డి.ఎస్.పి విఠల్ రెడ్డి

పెండింగ్‌ చలాన్లు, కరెంట్‌ బిల్లులు చెల్లించాలంటూ సైబర్‌ నేరగాళ్లు పంపుతున్న ఏపీకే లింకులను, ఫైల్స్‌ను తెరవవద్దని, ఏపీకే లింకులు పంపి, మాల్‌వేర్‌ సహాయంతో ఫోన్‌ను హ్యాక్‌ చేసి ఖాతాలు కొల్లగొడుతున్నారని, అపరిచితుల మాటలు నమ్మవద్దని బాన్సువాడ డి.ఎస్.పి విఠల్ రెడ్డి సూచించారు. సైబర్ నేరగాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానం, సైబర్ సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -