Tuesday, March 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్-కామారెడ్డికి వెళ్లేందుకు అందుబాటులో ఆర్టీసీ బస్సు

జుక్కల్-కామారెడ్డికి వెళ్లేందుకు అందుబాటులో ఆర్టీసీ బస్సు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
వారం రోజుల క్రితం జుక్కల్ నుండి కామారెడ్డి వెళ్ళెందుకు కామారెడ్డి జిల్లా డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పించడంతో జుక్కల్ మండల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడో 20 – 30 ఏళ్ల క్రితం కామారెడ్డి డిపోకు సంబంధించిన బస్సు వచ్చేది. నాటి నుండి నేటి వరకు కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే తలనొప్పిగా మారేది. మూడు బస్సులో ఎక్కి మూడు బస్సులు దిగితే తప్ప జిల్లా కేంద్రానికి వెళ్లలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కామారెడ్డి డిపో మేనేజర్ దినేష్ ప్రత్యేకచొరవతో సమస్యను తీర్చారు.

దీంతో మహారాష్ట్రలోని దెగ్లూరుకు బస్సు సదుపాయం కల్పించడంతో జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండల ప్రజలకు ఎంతో సదుపాయం కల్పించినట్లు అయింది. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించే ఆలోచన చేసి వెంటనే ఆచరణలోకి తీసుకురావడంతో స్థానికులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జుక్కల్ నుండి బిచ్కుంద వెళ్లేందుకు ఒక లోకల్ బస్సు ను నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -