Wednesday, July 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుRTC BUS : మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పు

RTC BUS : మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పు

- Advertisement -




నవతెలంగాణ మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో పార్కింగ్‌లో ఉన్న నైట్‌హాల్ట్‌ ఆర్టీసీ బస్సుకు ఆకతాయిలు నిప్పుపెట్టిన ఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. మిర్యాలగూడ డిపోకు చెందిన టీఎస్‌ 05జెడ్‌ 0047 నంబర్‌ బస్సును రోజు మాదిరిగానే గ్రామంలోని ప్రధాన బస్‌స్టాప్‌ కూడలిలో పార్కింగ్‌ చేశారు.

అయితే, గుర్తుతెలియని వ్యక్తులు బస్సు వెనుకవైపు నిప్పంటించడంతో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌, కండక్టర్‌.. పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో బస్సు వెనుక భాగం టైర్లతో సహా పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనకు కారణమైన ఆకతాయిల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -