- Advertisement -
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
తమిళనాడు అరుణచలం గిరిప్రదక్షణ కొరకు ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ డీఎం ప్రతిమా రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బస్సు నవంబర్ 8న బయలుదేరి కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తిచేసుకుంటుందని పేర్కొన్నారు. తిరిగి వచ్చేటప్పుడు జోగులాంబ దేవాలయం దర్శనం చేసుకొని ఆదిలాబాద్ కు నవంబర్ 11న రాత్రి పది గంటల వరకు చేరుకుంటుందని పేర్కొన్నారు. భోజన, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని, ప్రయాణానికి రూ. ఒక్కరికి 5200 ఖర్చు ఉంటుందని వివరించారు. ఈ గొప్ప అవకాశాన్ని ప్రయాణికులు, భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
- Advertisement -