- Advertisement -
- – ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
నవతెలంగాణ – బాల్కొండ - ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు బాల్కొండ లో ఉన్న పలు బస్ స్టాప్ ల వద్ద ఆపకుండా వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని బాల్కొండ మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎమ్ఏ షాహిద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న బస్ స్టాప్ లలో ఆపకుండా నేరుగా వెళ్లి పోతున్నారని దీంతో గ్రామం లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగులకు ప్రయాణికులకు గంటలపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడడంతో పాటు తీవ్రంగా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్టీసీ సంబంధిత అధికారులు బస్సులు స్టాప్ ల వద్ద ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
- Advertisement -



