భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
జాతర పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలి
హోర్డింగ్స్ ద్వారా ప్రచారం చేపట్టాలి : మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను సక్రమంగా నడపాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కోరారు. జాతర పూర్తయ్యేవరకు మేడారం నుంచి అపరేషన్లు నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి జాతరకి వచ్చే భక్తులకు విస్త్రృత అవగాహన కలిగించేలా హోర్డింగ్స్‌తోపాటు ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఆర్టీసీలో పెండింగ్ పనులు, బస్‌స్టేషన్ అభివద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రవాణా, ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత మేడారం జాతరలో 3491 ఆర్టీసీ బస్సులు నడిపించగా 16.82 లక్షల మంది వాటిలో ప్రయాణించారని గుర్తు చేశారు. ఈసారి 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణం చేస్తారనే అంచనాతో 4000 బస్సులను నడిపిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ప్రధానంగా మేడారం వెళ్ళే వరంగల్ ,హనుమకొండ , ఖమ్మం, కరీంనగర్ రూట్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందనీ, రద్దీకి తగిన విధంగా బస్సులు నడపడానికి అక్కడ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్‌స్టాప్‌లో క్యూలైన్ల వద్ద ప్రయాణికులు జిల్లాల వారిగా వెళ్ళే బస్సులు డిస్‌ప్లే అయ్యేలా చూడాలని అక్కడ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సమర్థవం తంగా పని చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచిం చారు. మేడారంలో సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టినట్టు శాశ్వత ఆర్టీసీ సముదాయ భవనాన్ని నిర్మించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశిం చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి జరుగుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మేడారం వచ్చే భక్తులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగిం చేలా హోర్డింగులు, బస్ స్టేషన్లలో , బస్సులో టీవీల ద్వారా ప్రచారాలు నిర్వహించాలని సూచించారు..
ఆర్టీసీలో పెండింగ్ బస్‌స్టేషన్ల అభివధి పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు రానుండడంతో అందు కు తగిన విధంగా మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పుడున్న జేబీఎస్, ఎంజీబీఎస్ మాదిరి నగరంలో మరిన్ని బస్ టెర్మినల్ రావాల్సిన అవసర ముందన్నారు. దానిని స్టడీ చేయాలని ఆర్టీసీకి సంబంధించిన భూబదలాయింపుపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కాలనీలకు ఆర్టీసీ ప్రజా రవాణాలో భాగంగా కొత్త రూట్లలో ఇటీవల ప్రారంభించిన ఆర్టీసీ బస్సు మంచి సత్ఫలితాలు ఇస్తుండటంతో తెలంగాణ వ్యాప్తంగా అవసరమైన రూట్లలో బస్సులు నడిపించేలా కార్యాచరణ రూపొందించాలని అధి కారులను ఆదేశించారు. విజన్ 2047లో ఆర్టీసీ లక్ష్యానికి అనుగుణంగా ఇప్పుడున్న బస్సుల సంఖ్య ను మరింత పెంచడం , ఉద్యోగుల సంఖ్యను పెంచడం తదితర వాటిపై కార్యాచరణతో ముందుకు పోవాలని ఆదేశించారు. సెర్ఫ్ ద్వారా తీసుకోవాల్సిన మిగిలిన బస్సులను త్వరగా ఆర్టీసీ లోకి తీసుకోవాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో విజిట్ చేసిన అంశాలు ఆర్టీసీ ఉన్నతాధికారుల దష్టికి తీసుకురావాలని ఆదేశించారు. నూతనంగా నిర్మిత మవుతున్న పెద్దపల్లి ,ఏటూరు నాగారం బస్‌డిపోల నిర్మాణాలు వేగంగా జరగాలని ఆదేశించారు. మహాలక్ష్మి ద్వారా 90కి పైగా డిపోలు లాభాల బాటలో ఉన్నప్పటికీ మిగిలిన డిపోలు నష్టానికి గల కారణాలపై అధ్యయనం చేసి తగు చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్టీసీ ఈడీలు , ఆర్‌ఎం లు, ఇతర ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
మేడారానికి ఆర్టీసీ బస్సులు సక్రమంగా నడపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



