నవతెలంగాణ – ఆర్మూర్ : నిజామాబాద్ ఆర్టీసీ- 2 డిపోకు చెందిన టీఎస్ 16 జెడ్ 165 ఆర్టీసీ బస్సు డ్రైవర్ విధి నిర్వహణలో నిర్మల్ టు నిజామాబాద్ బస్సు నడుపుతుండేవాడు. అయితే గురువారం పట్టణ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో సాయంత్రం డ్రైవర్ ఎస్ కె. ఇమామ్ సాహెబ్ ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ఆర్టీసీ టు డిపోకు చెందిన బస్సు డ్రైవర్ ఖమ్మం జిల్లా నుండి నిజామాబాద్ కు బదిలీపై వచ్చాడు. నిజామాబాద్ నుంచి ఇటీవలే అతనికి ఖమ్మం ఆర్టీసీ డిపోకు బదిలీ అయింది.
కానీ నిజామాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన అధికారులు ఆ బస్సు డ్రైవర్ ఇమామ్ ను రిలీవ్ చేయడం లేదని, పని నిమిత్తం సెలవు అవసరముందని అధికారులకు విన్నవించుకున్న సెలవులు సైతం ఆ డ్రైవర్ కు ఆ డిపోకు చెందిన ఆర్టీసీ అధికారులు ఇవ్వలేదని తెలిసింది. దీంతో విధి నిర్వహణలో నిర్మల్ టు నిజామాబాద్ బస్సు నడుపుతుండగా మార్గమధ్యలో ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బస్సును నిలిపి, మనస్థాపానికి గురై ఎలుకల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అక్కడున్న ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది చూసి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఆయనకు చికిత్స అందించారు.
దీంతో ప్రాణాపాయం నుంచి ఆయన తప్పించుకున్నాడు. స్థానిక ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది త్వరితగతంగా స్పందించకుంటే ఓ ఆర్టీసీ డిపో అధికారుల వేధింపులకు ఓ ఆర్టిసి బస్ డ్రైవర్ ప్రాణం బలైపోయి ఉండేది. ఏది ఏమైనా నిజామాబాద్ ఆర్టీసీ రెండవ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులపై అధికారుల వ్యవహార శైలి ఎలా ఉంది ఏ తీరుగా పనిచేస్తున్నారు అనే విషయాన్ని పూర్తిస్థాయిలో ఆ శాఖకు చెందిన అధికారులు పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా విచారణ జరిపించాలి. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. కాగా పట్టణ ప్రయాణ ప్రాంగణంలో ఈ సంఘటన తీవ్ర కలవరంకు గురిచేసింది.
అధికారుల వేధింపులతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES