నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైద్య పరీక్షలు చేయకుండా ఆర్టీసీ డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఆధారంగా తొలగింపు ఉత్తర్వుల జారీకి వీల్లేదంది. మెడికల్ టెస్ట్‌లు చేశాక నివేదికలను బట్టి తొలగింపునకు వీలుందని చెప్పింది. అదే విధంగా డ్రైవర్ ధర్నాలో పాల్గొన్నారనే అభియోగాలపై స్పందిస్తూ, ధర్నాలో 13 మంది పాల్గొంటే పిటిషనర్‌పై మాత్రమే చర్యలు చెల్లవంది. మధిర ఆర్టీసీ డిపో మేనేజరు తనను ఉద్యోగం నుంచి తొలగింపునకు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఉద్యోగం నుంచి తనను తొలగించారంటూ వెంకటి వేసిన పిటిషన్‌పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ తీర్పు చెప్పారు. బ్రీత్ అనలైజర్ తరువాత యూరిట్, బ్లడ్ టెస్ట్‌లు చేసి మందు తాగిందీ లేనిదీ తేల్చకుండా తొలగింపు చెల్లదన్నారు.
లైంగిక వేధింపుల కేసులో ఎదురుదెబ్బ
సైదాబాద్ చైల్డ్ హౌంలో బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కేసులో అరెస్టయిన సూపర్‌వైజర్ మహ్మద్ రహమాన్ సిద్దిఖీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతని విడుదలకు ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేసింది. సైదాబాద్ పోలీసులు అక్రమంగా రహమాన్‌ను అరెస్టు చేసి జైలుపాలు చేశారంటూ అతని సోదరి వేసిన పిటిషన్‌లో ఉత్తర్వుల జారీకి జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. లైంగికవేధింపుల అరోపణలు తీవ్రమైవని, విడుదలకు ఆదేశాలు ఇవ్వబోమని చెప్పింది.
ఆర్టీసీ డ్రైవర్ తొలగింపు చెల్లదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



