Saturday, May 24, 2025
Homeప్రధాన వార్తలుఆర్టీసీలో ఔట్‌ సోర్సింగ్‌ కండక్టర్లు

ఆర్టీసీలో ఔట్‌ సోర్సింగ్‌ కండక్టర్లు

- Advertisement -

– మ్యాన్‌పవర్‌ ఏజెన్సీల ద్వారా నియామకం
– బస్‌భవన్‌ నుంచి రీజినల్‌ మేనేజర్లకు ఉత్తర్వులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ కండ క్టర్ల నియామకానికి రంగం సిద్ధ మైంది. ప్రయివేటు మ్యాన్‌పవర్‌ ఏజెన్సీల ద్వారా వీరిని నియమిం చుకోవాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) బస్‌భవన్‌లోని మేనేజింగ్‌ డైరెక్టర్‌ కార్యాలయం ద్వారా రీజినల్‌ మేనే జర్లకు సర్క్యులర్లు(No.E7/122(44)/ 2025-PO(E&S) జారీ అయ్యాయి. ఈ నెల 8వ తేదీనే ఎమ్‌డీ కార్యాలయం నుంచి కార్పొరేషన్‌ కార్యదర్శి పేరుతో ఇచ్చిన ఈ ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీనిలో ఔట్‌సోర్సింగ్‌ కండక్డర్ల నియామక విధివిధానాలు, జీతభత్యాలను వెల్లడించారు. ఆర్టీసీలోకి రెండువేల ఎలక్ట్రిక్‌ బస్సులు కొత్తగా వస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ బస్సులన్నీ ప్రయివేటువే. అయితే ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తే ఎవర్నీ ఉద్యోగాల నుంచి తీయబోమని ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో కొత్త రిక్రూట్‌మెంట్లకు మంగళం పాడుతూ, సంస్థలోకి ఔట్‌సోర్సింగ్‌ కండక్టర్ల నియామకాన్ని చేపడుతుండటం వివాదాస్పదంగా మారుతుంది. ఆర్టీసీలో 3,120 కొత్త ఉద్యోగాల నియామక ప్రక్రియకు అనుమతి ఇచ్చామని ఓవైపు ప్రభుత్వం చెప్తూనే, మరోవైపు ఈ ఔట్‌సోర్సింగ్‌ నియామకాలు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే 3,120 కొత్త పోస్టుల భర్తీ ప్రకటన చేసి దాదాపు ఏడాది అవుతుంది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీపీఎస్‌సీ) ద్వారా వీటిని భర్తీ చేస్తామన్నారు. ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ అని వాయిదా వేశారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎప్పటికప్పుడు ‘త్వరలో’ అనే ప్రకటిస్తున్నారు. ఇప్పటికీ ఈ పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. కార్మికుల సమస్యలు పరిష్కరించి, ఆర్టీసీలో కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తేయాలనే డిమాండ్లు ఊపందుకుంటున్న సమయంలో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ఈనెల 27న అన్ని డిపోల వెల్ఫేర్‌ కమిటీల సభ్యులతో ఆర్టీసీ కళ్యాణమండపంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇటీవల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన కార్మిక సంఘాలు జరిపిన చర్చల్లో కార్మిక సంఘాలపై ఆంక్షల ఎత్తివేత కూడా ప్రధాన డిమాండ్‌గా ఉంది. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని నాయకులు ప్రకటించారు. ఈలోపే వెల్ఫేర్‌ కమిటీలతో యాజమాన్యం సమావేశాన్ని నిర్వహించడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఈ సమావేశాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఔట్‌సోర్సింగ్‌ కండక్టర్ల నియామకం విషయం వెలుగులోకి వచ్చింది.
ఇవీ విధివిధానాలు
-ఔట్‌సోర్సింగ్‌ కండక్టర్లకు నెలకు రూ.17,969 (స్కిల్డ్‌ వేజ్‌) గౌరవవేతనం ఇస్తారు.
-దీనికోసం కాంట్రాక్టర్లు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.2 లక్షలు జమచేయాల్సి ఉంటుంది.
-ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఎంపికైన కండక్టర్లకు టీజీఎస్‌ఆర్టీసీ ట్రైనింగ్‌ కాలేజీలో వారం రోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
-కాంట్రాక్టరే కండక్టర్‌ లైసెన్సుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం చెల్లించే ఫీజును ఆర్టీసీ రీయింబర్స్‌మెంట్‌ చేస్తుంది.
-అభ్యర్థుల ఒరిజినల్‌ ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లను కాంట్రాక్టర్ల ద్వారా ఆర్టీసీ తీసేసుకుంటుంది.
-వీరికి ఓవర్‌టైం డ్యూటీలు కూడా ఉంటాయి. గంటకు రూ.వంద, అంతకుమించిన టైం పనిచేస్తే రూ.200 చొప్పున చెల్లిస్తారు.
-ఔట్‌సోర్సింగ్‌ కండక్టర్లను పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో నియమిస్తారు.
-టిమ్‌ మిషన్ల కాస్ట్‌ను సెక్యూరిటీ డిపాజిట్‌ నుంచి మినహాయించుకుంటారు.
-పనిచేసే ప్రదేశానికి 35 కిలోమీటర్ల పరిధి వరకు వీరికి కాంప్లిమెంటరీ బస్‌పాసులు ఇస్తారు.
-ఔట్‌సోర్సింగ్‌ కండక్టర్లకు ప్రమాదబీమా ప్రీమియంను కాంట్రాక్టరే చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -