ఏడాదిలో 200కోట్ల మంది మహిళల ప్రయాణం
త్వరలో కొత్త బస్సులు : ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి
నవతెలంగాణ – ధూల్‌పేట్
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని, మహాలకిë పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉచిత బస్సుల్లో 200కోట్ల మంది ప్రయాణం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో బుధవారం ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మునిగిపోతున్న పడవలాంటి సంస్థ ఎందుకు అని అనుకున్న ఆర్టీసీని ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో లాభాల్లోకి తెచ్చిందన్నారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన జీరో టికెట్ల రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఎప్పటికప్పుడూ ఆర్టీసీకి చెల్లిస్తోందని చెప్పారు. ఈ పథకంతో ఆర్టీసీ ఆర్థికంగా బలోపేత మవుతోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2400 కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు 2800 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టీజీఎస్‌ఆర్టీసీ కసరత్తు చేస్తోందని తెలిపారు. సంస్థలో ఇప్పటికే 11 శాతం ఎలక్ట్రిక్ బస్సులున్నాయని, ఉచిత ప్రయాణమే కాదు.. బస్సులకు మహిళలను తమ ప్రభుత్వం యజమానులను చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని, దీంతో ప్రజా రవాణా వ్యవస్థ మరింతగా ప్రజలకు చేరువ అవుతుందని అన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీనిచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. మహి ళల దైనందిన జీవితంలో మహాలక్ష్మి పథకం భాగ మైందన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలుతో పాటు ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు చెప్పారు. రవాణా సదుపాయం, ఉద్యోగుల సంక్షేమానికి టీజీఎస్ ఆర్టీసీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రతి గ్రామం నుంచి మండలానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్త రహదారుల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు తమ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకోవడంతోపాటు ఆర్టీసీకి మేలు జరుగుతోందన్నారు.
టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకాన్ని ప్రస్తుతం 7913 బస్సుల్లో అమలు చేస్తున్నామని, ప్రతి రోజూ సగటున 35 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారని వివరించారు. ఈ పథకం అమలుకు ముందు ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 69 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 97 శాతానికి పెరిగిందని తెలిపారు. అనంతరం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న మహిళలు, విద్యార్థులను, ఈ స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది పలువురిని సన్మానించారు. మహా లకిë పథకానికి సంబంధించి రూ.6680 కోట్ల చెక్కును ప్రభుత్వం తరపున మంత్రులు ఆర్టీసీ ఉన్న తాధికారులకు అందజేశారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, ఖుష్రోషా ఖాన్, రాజశేఖర్, వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ఫ, హెచ్‌వోడీలు పాల్గొన్నారు.
‘మహాలక్ష్మి’తో లాభాల్లోకి ఆర్టీసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES