Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్టీసీని వెంటనే విలీనం చెయ్యాలి

ఆర్టీసీని వెంటనే విలీనం చెయ్యాలి

- Advertisement -

పిఆర్ సి, వేధింపులు ఆపాలి.. ఆర్టీసీ కార్మికుల నిరసన
నవతెలంగాణ – బాన్సువాడ(నసురుల్లాబాద్)

గత ప్రభుత్వం నిలిపివేసిన ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని, 2021- 25ల పిఆర్ సి లను అమలు చేయాలనీ, పనిబారం, వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ ఆర్టీసీ కార్మికులు ఎర్ర బ్యాడ్జిలతో డిపో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం బాన్సువాడ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట బాన్సువాడ ఆర్టీసీ బస్ డిపో జేఏసీ కార్మిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల వేతన సవరణ చేయడంతో పాటు ఉద్యోగ భద్రతకల్పించాలని, పనిభారం తగ్గించాలని కోరారు. అలాగే, అక్రమ చార్జీషీట్లు రద్దు చేసి, డీఏలు ఇప్పించాలని, ప్రభుత్వం వాడుకున్న ఆర్టీసీ నిధులను చెల్లించాలని డిమాండ్ చేశారు. అహర్నిశలు శ్రమ పడి పని చేస్తూన్న ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం పెడచెవిన పెడుతుందన్నారు.

ఆర్టీసీ సంస్థకు సమస్త కు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతున్న కార్మికులకు రావాల్సిన దానిపై చేసిన శ్రమ ను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సంస్థ తమ డిమాండ్ లను పరిష్కరించాక పోవడం శోచనీయం అని ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం జాతర ముందైనా తీపి కబురు తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు వి. డి దాస్, సంజీవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -