Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు

సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు

- Advertisement -

ఎస్‌డబ్ల్యూయూ,ఎస్‌డబ్ల్యూఎఫ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12 న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయనీ, ఆ సమ్మెలో ఆర్టీసీ కార్మికులు భాగస్వాములు కావాలంటూ ఎస్‌డబ్ల్యూఎఫ్‌(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు, ఎస్‌డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లుగా తీసుకొచ్చి గత నవంబర్‌లో నోటిఫై చేసిందని తెలిపారు. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులను తొలగిస్తూ, కార్మికులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం విధానాలు రూపొందిస్తున్నదనీ, దీనికి వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మిలు పాల్గొనాలని కోరారు.

ఆర్టీసీ లో ఇప్పటికే లేబర్‌ కోడ్‌లు అనధికారికంగా అమలవుతున్నాయనీ, యూనియన్ల కార్యక్రమాలపై నిషేధం విధించారనీ, 2021, 2025 వేతన సవరణలు అమలు చేయడం లేదనీ, 2017 అలవెన్సులు కూడా ఇవ్వటం లేదనీ, రిటైర్డ్‌ కార్మికుల బాకాయిలు చెల్లించటం లేదనీ, విద్యుత్‌ బస్సులు అద్దెకి తీసుకోవటం ద్వారా ఆర్టీసీ సంస్థ బోర్డ్‌ మాత్రమే మిగిలే ప్రమాదం ఉందనీ, అందుకే విద్యుత్‌ బస్సుల విధానం లో మార్పులు చేసి ఆర్టీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఆర్టీసీ యాజమాన్యనికి సమ్మె నోటీసులు ఇవ్వాలని, సమ్మె జయప్రడానికి కరపత్రం వేసి కార్మికులలో పంచాలని, ఆన్‌లైన్‌ బహిరంగ సమావేశం జరపాలని నిర్ణయించారు. సమావేశానికి హాజరు కాని సంఘాలు కూడా సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మె లో పాల్గొనాలని, సమ్మె కాంపెయిన్‌ లో కలిసి రావాలని కోరారు. ఈ సమావేశం లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఎస్‌డబ్ల్యూయూ ప్రచార కార్యదర్శిలు రవీందర్‌ రెడ్డి, కె మనోహర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -