Friday, July 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం9న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనండి

9న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనండి

- Advertisement -

– ఆన్‌లైన్‌ బహిరంగ సభలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకుల పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఈ నెల 9 న జరగబోయే జాతీయ సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనాలని ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు విజ్ఞప్తి చేశారు. గురువారం టీఎస్‌ఆర్‌టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ బహిరంగను యూనియన్‌ ప్రచార కార్యదర్శి పి రవీందర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎస్‌ రావు మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల 9న జాతీయ సమ్మె జరగబోతుందని చెప్పారు. నాలుగు లేబర్‌ కోడ్ల రద్దు కోసం, ఆర్టీసీ రక్షణ, సంఘాల పునరుద్ధరణ, విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పు తదితర డిమాండ్లపై ఆర్టీసీలోని 7 సంఘాలు ఎస్‌డబ్ల్యూఎఫ్‌(సీఐటీయూ), ఈయూ(ఏఐటీయూసీ), ఎస్‌డబ్ల్యూయూ(ఐఎన్‌టీయూసీ), టీఎంయూ(టీ), బీడబ్ల్యూయూ, బీకేయూ, కేపీ(టీఎన్‌టీయూసీ) సమ్మె నోటీసులు ఇచ్చాయని గుర్తు చేశారు. రెండు సంఘాలు బయట నుంచి మద్దతు ఇస్తున్నాయన్నారు. ఈ సమ్మె కార్మికుల ఆర్థిక సమస్యలపై కాకుండా ఆర్టీసీల రక్షణ, చట్టాల మార్పు కోసం ు సమ్మె జరగబోతుందని చెప్పారు. చట్టాల్లో మార్పులు తీసుకురావటం మూలంగానే ఆర్టీసీలో పనిభారం పెరిగిందని వివరించారు. ఈ సభలో స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ వైస్‌ చైర్మెన్‌ అబ్రహం, బహుజన వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రామచంద్రమ్‌, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ హైదరాబాద్‌ జోన్‌ అధ్యక్ష కార్యదర్శులు చంద్రప్రకాష్‌ జి. ఆర్‌. రెడ్డి ప్రసంగించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -