నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లో 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-బస్ సేవా పథకం కింద ఈ బస్సులను మంజూరు చేయడంతో.. వాటి కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఆర్టీసీ దృష్టి సారించింది. ఈ క్రమంలో, హైటెన్షన్ పవర్ కనెక్షన్ల కోసం రూ. 292 కోట్లు, పది కొత్త బస్ డిపోల నిర్మాణానికి రూ. 100 కోట్లు కలిపి మొత్తం రూ. 392 కోట్లు కేటాయించాలని ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.ఈ కొత్త బస్ డిపోల కోసం ఒక్కోదానికి 10 ఎకరాల చొప్పున మొత్తం 100 ఎకరాల భూమి కావాలని ఆర్టీసీ కోరింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనువైన స్థలాలను గుర్తించేందుకు ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని 19 పాత డిపోలు, కొత్తగా ప్రతిపాదించిన 10 డిపోల్లో ఈ బస్సుల కోసం హెచ్‌టీ పవర్ కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా బస్సుల ఛార్జింగ్ కోసం కేవలం డిపోలకే పరిమితం కాకుండా హైదరాబాద్‌లో వ్యూహాత్మక ప్రాంతాల్లో 10 కొత్త ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఒక్కో ఛార్జింగ్ పాయింట్ కోసం 2 వేల చదరపు మీటర్ల స్థలం అవసరం ఉంటుంది.
ఆర్టీసీ కీలక నిర్ణయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES