Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ క్యాలెండర్ ఆవిష్కరణ

తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ క్యాలెండర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 2026 నూతన సంవత్సరానికి సంబంధించిన సమాచార హక్కు పరిరక్షణ కమిటీ (ఆర్‌టీఐ) క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. నేషనల్ డైరెక్టర్ ఎం.ఏ. సలీం  ఆదేశాల మేరకు బీబీపేట ఆర్టీఐ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మండల తాసిల్దార్ గంగాసాగర్, డిప్యూటీ తాసిల్దార్ రోజా  కలిసి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  సమాచార హక్కు చట్టం సామాన్య పౌరులకు ఒక వరం లాంటిదని, ప్రతి ఒక్కరూ ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజలకు పారదర్శక పాలన అందించడంలో ఆర్టీఐ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారుఅనంతరం ఆర్టీఐ బీబీపేట మండల కమిటీ అధ్యక్షులు ఏం. నాంపల్లి, కార్యదర్శి పండ్ల హనుమంతు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ప్రజలకు శక్తివంతమైన సాధనమని, ముఖ్యంగా పేద ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ నుండి అన్ని ప్రభుత్వ విభాగాల వరకు సమాచారం తెలుసుకునే హక్కు ఈ చట్టం ద్వారా సామాన్య ప్రజలకు లభిస్తుందని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌లతో పాటు మండల గిర్దావర్ రామ్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ రాణి, సిబ్బంది అంద రాజయ్య, జాంగిటి రాజు, రామచంద్రం, లింగం తదితరులు మరియు ఆర్టీఐ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -