Wednesday, October 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజాస్వామ్యంలో కీలక చట్టం ఆర్టీఐ

ప్రజాస్వామ్యంలో కీలక చట్టం ఆర్టీఐ

- Advertisement -

ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఉన్న కీలకమైన చట్టం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)-2005 అని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఐ వారోత్సవాలు ఈ నెల ఐదు నుంచి 12 వరకు జరపాలని నిర్ణయించింది. అందులో భాగంగా సమాచార హక్కు చట్టంపై మంగళవారం ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలో ఆర్టీఐ చరిత్ర, రాజ్యాంగ పరిరక్షణ, సుప్రీంకోర్టు ప్రధాన తీర్పుల గురించి బాలకిష్టారెడ్డి వివరించారు. ఆర్టీఐ చట్టం అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను భారత రాజ్యాంగ హామీలతో కలిపి పనిచేస్తుందని చెప్పారు.

చట్టంలోని సెక్షన్‌ 4, సెక్షన్‌ 8పై విశేషంగా దృష్టి పెట్టాలని కోరారు. ఏ సమాచారం వెల్లడించవచ్చో, ఏది కాదో దిశానిర్దేశం చేస్తుందన్నారు. విశ్వవిద్యాలయాలకు ఆర్టీఐ ప్రశ్నలపై నిర్వహణ కోసం సాధారణ బుక్‌లెట్‌/ హ్యాండ్‌ బుక్‌ తయారీలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆర్టీఐపై విశ్వవిద్యాలయాలు ఈనెల 12 వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ఫొటోలు, నివేదికలను ఈనెల 15 నాటికి తెలంగాణ సమాచార కమిషన్‌, ఉన్నత విద్యామండలి కార్యాలయానికి పంపించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, సిబ్బంది, ఆర్టీఐ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -