Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్టీవో అధికారుల ఆకస్మిక వాహన తనిఖీలు

ఆర్టీవో అధికారుల ఆకస్మిక వాహన తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం బస్వాపూర్ టోల్ గేట్ వద్ద బుధవారం ఆర్టీవో అధికారులు ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ పత్రాలు సరిగా ఉన్నాయా…? లేవా…? అని పరిశీలించారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని, సరైన వాహన పత్రాలతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపరాదని అధికారులు వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సుందర్ లాల్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -