నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామ సర్పంచ్ గా చంద్రగిరి సంపత్, ఉప బడితేల కుమారస్వామి, వార్డు సభ్యులు చంద్రగిరి అశోక్, జాడి రాజశేఖర్, గాదె గట్టయ్య, టేకం రవళి, జాడి అనసూర్య, గాదె రమేష్, మోత్కురి సంధ్యారాణి, కొమ్మేర విజయలక్ష్మి, భాస్క అశోక్ లు సోమవారం ప్రత్యేక అధికారి, కార్యదర్శిచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పాలకవర్గాన్ని సత్కరించారు. గ్రామాభివృద్ధి పాటుపడాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి బడితేల స్వరూప-రాజయ్య, చెంద్రమొగిలి, మహేష్ పాల్గొన్నారు.
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన రుద్రారం సర్పంచ్, ఉప సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



