వేడి నీటి కోసం గ్రీజర్లను ఏర్పాటు చేయాల
మంత్రి పొన్నం ప్రభాకర్ కు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్ వినతి
నవతెలంగాణ – మిర్యాలగూడ
ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలి తీవ్రత పెరిగిన్నందున వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులకు తక్షణమే రగ్గులు పంపిణీ చేయాలని అంతేగాక స్నానానికి వేడి నీటి కోసం గ్రీజర్లను ఏర్పాటు చేయాలనీ సోమవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కలిసి వినతి పత్రం అందజేసినట్లు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని వసతి గృహాలలో గురుకులాలు, కేజీబీవీలో చదువుకునే విద్యార్థులు చలికి వణికి పోతున్నారన్నారు. గదులకు తలుపులు కిటికీలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడడమే గాకుండా ఇంకా కొన్నిచోట్ల బెడ్లు లేక బండలపైనా దుప్పట్లు పరచుకుని పడుకుంటున్నారని అన్నారు. వణికించే చలిలో విద్యార్థులు చల్లని నీటితో స్నానం చేయలేక వణికి పోతున్నారని రగ్గులు ఇచ్చి, గ్రీజర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
వసతి గృహాల విద్యార్థులకు రగ్గులు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


