నవతెలంగాణ – అశ్వారావుపేట
స్వేచ్చ – స్వాతంత్రం – పోరాటం అంటే తెలియని,వీటితో సంబంధంలేని నాయకులు నేడు పాలన చేస్తూ చరిత్రనే వక్రీకరిస్తున్నారు అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేసారు. సీపీఐ(ఎం) మండల కమిటీ ఆద్వర్యంలో మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ పర్యవేక్షణలో మండల కార్యదర్శివర్గ సభ్యులు కారం సూరిబాబు అద్యక్షతన శుక్రవారం మండలంలోని నందిపాడు లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవ సభను నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతు పోరాటం జరిగిన నేపధ్యం,సామాజిక పరిస్థితులకు ప్రస్తుతం కేంద్ర పాలకులు,భాజపా నాయకులు చెప్పే వక్రీకరణ చరిత్ర కు సంబంధం లేదని అన్నారు. 1946 – 51 మధ్య కాలంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో నాటి రాజరిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మడకం నాగేశ్వరావు,మాడి నాగేశ్వరావు చిచ్చోడి కన్నయ్య,కారం జోగారావు, మడకం రాజబాబు తదితరులు పాల్గొన్నారు.