Monday, February 16, 2026
E-PAPER
Homeఖమ్మంసత్తుపల్లిలో పాలకవర్గ ప్రమాణ స్వీకారం..జర్నలిస్టుల‌కు నో ఎంట్రీ

సత్తుపల్లిలో పాలకవర్గ ప్రమాణ స్వీకారం..జర్నలిస్టుల‌కు నో ఎంట్రీ

- Advertisement -
  • అనుమతి నిరాకరించినందుకు జర్నలిస్టుల ధర్నా

నవతెలంగాణ-సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంతో స్థానిక జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు.జర్నలిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మీడియా కవరేజ్ చేసేందుకు అనుమతి నిరాకరించడం తగదని వారు అభిప్రాయపడ్డారు. ప్రజలకు సమాచారం అందించాల్సిన మీడియాను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ, ప్రజల ఓట్లతో గెలిచిన కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం ప్రజల ముందే పారదర్శకంగా జరగాలి. అధికారుల వైఖరి అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -