- Advertisement -
నవతెలంగాణ – మందమర్రి : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని పోలీసులు నిర్వహించే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్బంగా మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో “జాతీయ ఏక్తా దివస్” వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. జాతీయ సమైక్యతను చాటిచెప్పే “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని మందమర్రి పోలీస్ విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఎస్ ఐ మాట్లాడుతూ 2కె రన్ శుక్రవారం ఉదయం 07:00 గంటలకు సింగరేణి గ్రౌండ్ నుండి పాత బస్టాండ్ వరకు ఉంటుందని దీనిలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -



